17 July, 2026 | 1:02 AM

కాలనీ పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

17-07-2026 12:00 AM

మేడిపల్లి, జూలై 16 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని అనఘాపురి కాలనీ పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు కాపారు. 2026లో ఆక్రమణదారులు పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించగా, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, ఇతర సభ్యులు జీహెచ్‌ఎంసీ అధికారులకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.

దీనిపైన స్పందించిన హైడ్రా అధికారులు అనఘాపురి కాలనీలోని 92 సర్వే నంబర్లో గల 498 గజాల పార్కు స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఎటువంటి అక్రమ ఆక్రమణలు జరగకుండా హైడ్రా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పార్కు స్థలాన్ని కాపాడినందుకు కాలనీవాసులు  హర్షం వ్యక్తం చేశారు.