13 July, 2026 | 4:21 AM

ఎస్‌ఐఆర్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

13-07-2026 02:33 AM

24వ తేదీలోగా సమర్పించాలి: తహసీల్దార్ భీమర్తి చంద్రశేఖర్

ఘట్కేసర్, జూలై 12 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు పంపిణీ చేసిన దరఖాస్తు ఫారాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఘట్కేసర్ తహసీల్దార్ భీమర్తి చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు సర్ దరఖాస్తు ఫారాలను అందజేశారని పేర్కొన్నారు.

ఓటర్లు ఫారాలను పూర్తిగా స్పష్టంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపి సంబంధిత బిఎల్‌ఓ లు, సూపర్వైజర్లు లేదా నియమిత వాలంటీర్లకు ఈనెల 24వ తేదీలోగా తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. గడువు అనంతరం సమర్పించే ఫారాలను స్వీకరించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఫారాలు నింపడంలో ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత బిఎల్‌ఓ లు, సూపర్వైజర్లు, వాలంటీర్ల సహాయం తీసుకోవాలని కోరారు. అవసరమైన చోట ఓటర్లకు మార్గనిర్దేశం చేసి ఫారాలు సక్రమంగా నింపేలా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.