కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షునికి శుభాకాంక్షలు
మేడ్చల్ అర్బన్, జూలై 12 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గౌడవెల్లి గ్రామ మాజి సర్పంచ్ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గరిసెల సురేందర్ ముదిరాజ్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ మాజి ప్రజా ప్రతినిధులకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్.మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోమారం రమణారెడ్డి.గౌడవెల్లి గ్రామ మాజి సర్పంచ్ కోరని భగవాన్ దాస్.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ వినోద్ గౌడ్.ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాలకుర్తి మురళి గౌడ్.మాజి కో ఆప్షన్ సభ్యులు డి గోపాల్ యాదవ్.వీరస్వామి.పూజారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.






