డంపింగ్‌యార్డు ఏర్పాటును అడ్డుకోవాలి
మేడ్చల్, జూలై 12 (విజయక్రాంతి): కీసర మండలం రాంపల్లి లోని సర్వే నంబర్ 226 లో డంపింగ్ యార్డ్ ఏర్పాటను అడ్డుకోవాలని వివిధ కుల సంఘాల ప్రతినిధు లు, నాయకులు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ కు వినతిపత్రం సమర్పించారు.
గతంలో ప్రభుత్వం కుమ్మరి, వడ్డెర, ఎరుకల కులాల వారికి 8 ఎకరాల భూమి కేటాయించిందని, ప్రస్తుతం ప్రభు త్వం ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కు ప్రయత్నిస్తుందని తెలిపారు. తమకు కేటాయించిన భూమిని రక్షించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ డంపింగ్ యార్డ్ ఏ ర్పాటు చేయకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న కాలనీల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ప్రజారోగ్యానికి, పర్యావరణానికి హానికరమని అన్నారు.
ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరుకల కుమ్మరి వడ్డెర సంఘాల కోసం ప్రతి సంఘానికి 10 లక్షల రూపాయల చొప్పున ఎంపీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం కీసర ఆర్డీవో వెంకటరెడ్డి తో ఫోన్లో మాట్లాడారు. వివిధ కులాల వారికి కేటాయించిన భూముల జోలికి వెళ్ళవద్దన్నారు. భూములను తీసుకుంటే రాంపల్లిలో ధర్నా నిర్వహి స్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ శర్మ, మాజీ జడ్పిటి సి సభ్యుడు మునిగంటి సురేష్, నాగారం డివిజన్ అధ్యక్షుడు కొండబోయిన నాగరాజు యాదవ్, సీనియర్ నాయకులు బొ మ్మిడి బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు మామిడి జంగారెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షు డు రామవరం గిరి గౌడ్, భరత్ ముదిరాజ్, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






