‘సర్’ ప్రక్రియను వేగవంతం చేయండి
16-07-2026 12:00 AM
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి; జూలై 15(విజయ క్రాంతి): జరుగుతున్న సర్ ప్రక్రియను బి ఎల్ ఓ లు వే గవంతం చేయాలని ఎంపీవో ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలోని టంగుటూరు, ఎలువర్తి గ్రామపంచాయతీలను సందర్శించి జరుగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందుకు మిగిలిపోయిన ఓటర్లను నమోదు చేసే కార్యక్రమాన్ని ఉదయాన్నే ప్రతి బి ఎల్ ఓ టర్ల ఇంటికి వెళ్లి నమోదు చేయాలని ఆదేశించారు. రెండు చోట్ల ఓట్ల పేర్లు ఉన్న వాటిని తొలగించి ఓటర్ లిస్ట్ ఒకే పేరు ఉండేలా చూడాలన్నారు. మృతి చెందిన వారి ఓట్లను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగభూషణం, ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.






