సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కమిటీ ఏర్పాటు
16-07-2026 12:00 AM
షాద్ నగర్, జులై 15 (విజయక్రాంతి): సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వైఎం తండాలో లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్హెచ్పీఎస్) ఆధ్వర్యంలో ’డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ’ ఏర్పాటైంది. జీవో 641ని రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని కమిటీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కమిటీకి అధ్యక్షుడిగా మిట్టు నాయక్, ప్రధాన కార్యదర్శిగా బిచ్య నాయక్, సలహాదారులుగా ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్, మేకగూడ సర్పంచ్ రామావత్ రాజు నాయక్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.






