8 April, 2026 | 3:31 AM

జగిత్యాల మున్సిపల్ ఆఫీస్‌లో ఏసీబీ దాడి

08-04-2026 01:46 AM
  1. అవినీతి ఆరోపణలపై 9 గంటలకుపైగా తనిఖీలు
  2. సిబ్బంది ఫోన్లు స్వాధీనం

జగిత్యాల, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): జగిత్యాలలోని మున్సిపల్ కార్యాలయం లో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించా రు. పలు విభాగాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చిన ఫిర్యాదులను మేరకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడుల సందర్భంగా కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎలాంటి సమాచారాన్ని బయటకు పంపకుండా ముం దస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కార్యాలయంలోని పత్రాలు, ఫైళ్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. జగిత్యాలలో అనుమతుల మంజూరు, నిర్మాణాల అనుమతుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల పనితీరును సమగ్రంగా పరిశీలిస్తున్నారు.

అక్రమాలపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే సం బంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని ఏసీబీ వర్గా లు పేర్కొన్నాయి. ఈ దాడులతో మున్సిపల్ కార్యాలయ సిబ్బందిలో కలకలం రేగింది. పట్టణ ప్రజలు మాత్రం ఈ చర్యలను స్వాగతిస్తూ, అవినీతి నిర్మూలనకు ఇది మొదటి అడుగు కావాలని అభిప్రాయపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అధికారులు ఇంకా తనిఖీ లు నిర్వహిస్తుండటంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ తనిఖీలో ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు.