27 August, 2026 | 4:25 AM

మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకాలు

27-08-2026 02:23 AM

సిద్దిపేటలో భారీ సంఖ్యలో శాంతి ర్యాలీ నిర్వహించిన ముస్లింలు 

సిద్దిపేట, ఆగస్టు 26 (విజయక్రాంతి): మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకలని సిద్దిపేట ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం తహరికే తహఫుజె సున్నియత్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఆధ్వ ర్యంలో భారీ సంఖ్యలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు.

సిద్దిపేట పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న మస్జీద్ నుండి ప్రారంభం అయినా ర్యాలీ మెదక్ రోడ్డు గుండా విక్టరీ టాకీస్ చౌరస్తా మీదుగా ఈద్గాహ మైదానం వద్ద ఉన్న ఇక్బాల్ మీనార్ వరకు కొనసాగింది. ఈద్గాహ మైదానం వద్ద ఉన్న జనుల్లా షా దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థలతో ర్యాలీ ముగిసింది.

ఈ సందర్బంగా ముస్లిం మత పెద్దలు, వక్తలు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త యవ్వత్తు మానవాళికి మెసెంజర్ అన్నారు. ఆయన చేసిన ప్రవచనాలు ప్రపంచ శాంతికి మార్గదర్శకాలని తెలిపారు. నిరుపేదలకు సహాయం చేయాలనీ అనాదలకు ఆసరాగా ఉండాలని  మొహమ్మద్ బోదించారన్నారు.

మనుషుల్లో కుల మత తారతమ్యాలు చూడొద్దని చెప్పారని, మనుషులు మానవత్వం కలిగి ఉండాలని తెలిపారన్నారు. తల్లి దండ్రులను ప్రేమగా చూసుకోవాలని వారిని ఒక్కమాట అన్న అల్లాహ్ సంతోష పడడని సూచించారన్నారు. మద్యం,  డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలకు, వడ్డీలకు దూరంగా ఉండాలని సూచించారాన్నారు. మీ పక్కన ఉన్నవారు సంతో షంగా ఉంటేనే మీరు సంతోషంగా ఉన్నట్టు అని బోదించారాన్నారు. నేటి యువత ఆయన చూపిన బాటలో నడవాలని అన్నారు. కార్యక్రమంలో ముఫ్టీ వాహబ్ ఖాన్, ముఫ్టీ కరీంద్దీన్ పటేల్, అసిఫ్ మత పెద్దలు పాల్గొన్నారు.