18 May, 2026 | 5:34 PM

హ్యాండ్‌బోర్ ప్రారంభించిన ఆత్రం సుగుణక్క

18-05-2026 04:46 PM

జైనూర్, మే 18 (విజయక్రాంతి): జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్‌గూడలో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు ఇటీవల డీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క దృష్టికి తీసుకెళ్లారు.  సమస్యపై స్పందించిన ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలో నూతన హ్యాండ్‌బోర్ ఏర్పాటు చేయించారు. ఆదివారం రోడ్‌గూడకు వెళ్లి హ్యాండ్‌బోర్‌ను సుగుణక్క ప్రారంభించగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉయిక చందు, ఉప సర్పంచ్ ఆత్రం జమున, గ్రామ పెద్దలు కుంరం దుందే రావు, కడం రాము గ్రామ పటేల్, కుంరం సోనేరావు, భూసిమెట్ట సర్పంచ్ దుర్వ సింధు తదితరులు పాల్గొన్నారు.