ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ముందస్తు అరెస్ట్
కరీంనగర్ క్రైమ్ జులై 13 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రవేట్ విద్యాసంస్థల దోపిడీపై నిరసిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడియ్యడానికి వెళుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సర్దార్ రణధీర్ సింగ్ రానా నీ వారి ఇంట్లో ముందస్తు అరెస్ట్ చేసి కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించిన ఎస్సై రాజ్ కుమార్. ఆమ్ ఆద్మీ పార్టీ ( ఏ ఏపీ ) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సర్దార్ రణధీర్ సింగ్ రాణా మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని తీవ్రంగా ఖండించారు,తెలంగాణలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ప్రైవేటు విద్యా దౌప్పడిని అరికట్టాలని మరియు రాష్ట్రానికి పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం అత్యంత దురదృష్టకరం అన్నారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు. అలాంటి శాంతియుత కార్యక్రమాలను అణచివేసే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. అరెస్ట్ చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు పోలీసు శాఖను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ తరఫున డిమాండ్ చేశారు. ప్రజల గొంతును అరెస్టులతో అణచివేయలేరు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది అన్నారు.






