30 June, 2026 | 9:45 PM

Breaking News

రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •  

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

18-12-2025 02:03 AM

భర్తకు తీవ్ర గాయాలు

ఓటేసి వెళ్తుండగా వెంకటాపూర్‌లో ఘటన 

మహబూబాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసి వెళ్తుండగా కా రు పల్టీ కొట్టడంతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల పరిధిలో బుధవారం జరిగింది. భూపాలపల్లి సింగరేణి సం స్థలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలకు చెందిన అల్వాల దేవేందర్ అపర్ణ దంపతులు కారు లో స్వగ్రామానికి వచ్చి బుధవారం ఉద యం ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి భూపాలపల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో వెంకటాపూర్ వద్ద మూలమలుపు వద్ద కారు ప్రమాదవశాత్తు ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో అపర్ణ అక్కడికక్కడే మరణించగా దేవేందర్ గాయపడ్డాడు.