హాస్టల్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సదాశివనగర్, జులై 10(విజయక్రాంతి): మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి రబ్బర్ బ్యాండ్లతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గాంధార్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రాఘవేంద్ర సదాశివ నగర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతూ బాలుర వసతి గృహంలో గత రెండు రోజుల క్రితం తండ్రి వెంకటి వదిలి వెళ్ళినట్టు తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం మేనత్త చనిపోవడంతో మొన్నటి వరకు ఇంటి దగ్గరే ఉన్న రాఘవేంద్ర ఒక రెండు రోజుల క్రితం హాస్టల్లో వచ్చి మేనత్త మరణాన్ని జీర్ణించుకోలేక గురువారం రాత్రి రబ్బర్ బ్యాండ్ లు మెడకు వేసుకొని బలవన్మరణానికి పాల్పడ గా వెంటనే అప్రమత్తమైన హాస్టల్ వార్డెన్ గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మేనత్త మరణాన్ని జన్మించుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పుష్ప రాజ్ తెలిపారు.






