10 July, 2026 | 12:46 PM

రోడ్డు కోసం... రక్తం చిందిస్తున్న ప్రజలు

10-07-2026 11:48 AM
  1.  షేక్ పల్లి గ్రామ పరిధిలో తాండవాసుల నిరసన
  2.  జిల్లా కలెక్టర్, ఆర్థివో, పోలీస్ అధికారులకు పిర్యాదు 
  3.  రోడ్డు విడవమంటున్న పట్టాదారులు

మహబూబ్ నగర్ /హన్వాడ : హన్వాడ మండల పరిధిలోని షేక్పల్లి గ్రామ పంచాయతీ లోగల తండావాసులు రోడ్డు కోసం గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్,ఆర్డివో, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన రోడ్డు మార్గం గతంలో మాదిరిగా ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చల్మెల్ కుంట తండా, లస్కర్ నాయక్ తండా లకు ఏండ్ల తరబడి రోడ్డు ఉన్నప్పటికీ ఇటీవల కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు ఆవ తాండాలకు రోడ్డు లేదని తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని తాండవాసులు గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండావాసులు ఒకరికొకరు  రోడ్డు కావాలని కొనుగోలు చేసిన వ్యక్తులు ఇవ్వమని ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో దాడులు కూడా చేసుకునే రక్తాలు చిందించిన దాఖలాలు నెలకొన్నాయి. ఉన్నత అధికారులు స్పందించి ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించకపోతే మరిన్ని ఆందోళనలు అత్యధికం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.