బోధన్ సీఐ విద్యార్థి సంఘాలకు వార్నింగ్
10-07-2026 11:49 AM
బోధన్,జూలై 10(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యాసంస్థలను బలవంతంగా మూసివేయించాలని ప్రయత్నించే విద్యార్థి సంఘాల ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ హెచ్చరించారు.విద్యా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా యథావిధిగా విద్యా సంస్థలకు హాజరు కావాలని అధికారులు సూచించారు.






