05-02-2026 01:35:56 AM
ఖైరతాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకుని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మెడికల్ ఆంకాలజీ విభాగం ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది యునైటెడ్ బై యూనిక్ అనే నినాదంతో బంజారాహిల్స్ ప్రాంగణం నుంచి పంజాగుట్ట మెయిన్ గేట్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు.
బుధవారం నిర్వహించిన ఈ ర్యాలీని నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, టార్గెటెడ్ థెరపీ, రోబోటిక్ సర్జరీ వంటి అధునాతన చికిత్సలు సామాన్యులకు అం దుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సత్యనారాయణ, శాంతవీర్, రంగనాథ్ తదితరులున్నారు.