2 July, 2026 | 3:03 AM

కలెక్టర్‌కు స్వాగతం పలుకుతున్న గిరిజన మహిళ

02-07-2026 02:00 AM

నిర్మల్ జూలై 1  ( విజయక్రాంతి): రైతులు ఆయిల్ పామ్ పంటల సాగు సాగు చేస్తున్న గిరిజన రైతులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రశంసించారు. కలెక్టర్ బుధవారం మామడ మండలం పరిమండల్ గ్రామంలో గబ్బర్ సింగ్ చౌహాన్, బిక్కు నాయక్ చౌహాన్ లకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అధికారులు, రైతులతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ప్రస్తుతం సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య ఆయిల్ ఫామ్ పంటలు ఎంతో మేలని తెలిపారు.

మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల రైతులకు తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుంది అన్నారు. రైతులకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు ఇప్పటికే 8800 ఎకరాల్లో ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమణ, వ్యవసాయ అధికారి అంజిప్ర సాద్, ఇతర అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

మాతా, శిశు ఆసుపత్రి కలెక్టర్ తనిఖీ 

నిర్మల్ జూలై 1 ( విజయక్రాంతి): ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో బుధవారం జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశా రు. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశిం చారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీ లించారు. ప్రతిరోజూ 24 గంటలూ వైద్యు లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మం దులను ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో స్వయంగా మాట్లాడి, వైద్యం సరిగ్గా అందుతుందా, వసతులు ఎలా ఉన్నాయనే వివరాలను ఆరా తీశారు. ప్రజలు ప్రసవా లు, ఇతర చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.ఈ తనిఖీలో ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.