29 August, 2026 | 1:26 AM

చెంజర్లలో ‘ట్రాక్టర్ మగ్గం నేత’

29-08-2026 12:19 AM

రాఖీ పౌర్ణమి వేళ పద్మశాలీల సంప్రదాయ కార్యక్రమం

మానకొండూరు, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలీలు నిర్వహించే సాంప్రదాయమైన ఆచారంలో భాగంగా ట్రాక్టర్ మగ్గం నేత కార్యక్రమాన్ని శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్లలో పద్మశాలి కుల బాంధవులు ఘనంగా నిర్వహించారు. పద్మశాలీల వృత్తి, సంప్రదాయానికి ప్రతీకగా మగ్గాన్ని, ట్రాక్ట్ప ఏర్పాటు చేసి నేత కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పద్మశాలీలు సంప్రదాయ వస్త్రాలు, కండువాలు ధరించి మగ్గం నేసే కార్యక్రమాన్ని చేపట్టారు. తమ కులవృత్తి, చేనేత సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం చాటి చెప్పింది. గ్రామంలోని ప్రధాన, పురవీధుల గుండా గుట్టపై వెలసిన శివాలయం వరకు శోభాయాత్ర సాగింది. ట్రాక్టర్ పై అమర్చిన మగ్గంతో నేచిన వస్త్రాలను గ్రామంలోని హనుమాన్ దేవాలయం, శివాలయం, గుట్ట శివాలయంలో దేవతా మూర్తులకు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్లెన కనుకమ్మ, కొమురయ్య, ఉప సర్పంచ్ గడ్డి గణేష్,వార్డు సభ్యులు పద్మశాలి సంఘం నాయకులు ఎలగం రాజయ్య, భైరి వెంకటయ్య, ఎల్లయ్య రమేష్, రాములు, ఒడ్నాల ఓదెలు,సదానందంమార్కండేయ,బొలబత్తుల ఆంజనేయు లు, రాజు,గంగుల వెంకటేశ్వర్లు, వాసాల తి రుపతి, బాసబత్తుల వివేక్,రాజేశం, సంపత్, శ్రీరాముల భూమయ్య,నర్సయ్య,ఆడెపు కు మార్, సంపత్,రాజు,లక్ష్మీరాజం,దాసరి కొ మురెల్లి, పనస సంపత్, రామ్మూర్తి, సుధాకర్,చంద్రాకర్ తదితరులు పాల్గొన్నారు.