17 June, 2026 | 8:37 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డ్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలి

31-12-2025 12:54 AM

సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి

సుల్తానాబాద్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): ఎరువుల అమ్మకందారులు విధిగా ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి అ న్నారు, మంగళవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పైడితల్లి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని ఫెర్టిలై జర్ డీలర్స్ , సొసైటీ సీఈవో లతో సమావే శం నిర్వహించారు.

ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ ప్రస్తుతం సుల్తానాబాద్ మం డలoలో యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయని, కావున రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా యూరియా పంపిణీ చెయ్యాలి అన్నారు, ఫెర్టిలైజర్ బుకింగ్ అప్ లో యూ రియా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈపీఓస్ లో ఎంటర్ చేసి యూరియా అ మ్మాలని, అమ్మిన తర్వాత స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి, రసీదు ఇవ్వాలి అన్నారు,ఈ కార్యక్రమంలో ఏఈఓలు, ఫెర్టిలైజర్ డీలర్స్, సింగిల్ విండోలా సీఈవోలు పాల్గొన్నారు.