17 June, 2026 | 8:50 PM

Breaking News

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు   •   కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •  

చిన్నతనం నుంచే సేవాగుణం కలిగి ఉండాలి

07-02-2026 12:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఎన్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ ఎన్ ఎస్ ఎస్ 1వ యూనిట్ ఆధ్వర్యంలో కంబాలపల్లి గ్రామం లో నిర్వహించనున్న ఏడు రోజుల శిబిరాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మణ్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జాతీయ సేవా పథకంలో ఏడురోజుల ప్రత్యేక శిబిరంలో వలంటీర్లు క్రమశి క్షణతో మెలగాలని, గ్రామానికి శ్రేష్ఠమైన సేవలు అందించాలని, సేవా తత్పరత కలిగి ఉండాలని ఉద్బోధించారు. పెళ్లిరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలను నాట డం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖరం, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ అధికారి అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ చీరిక వసంత ఉపేందర్ రెడ్డి , ఉప సర్పంచ్ కటకం యాకన్న, పంచాయతీ సెక్రటరీ మయూరి, నేత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, పి జె ఆర్ కనెకట్స్ పి. జైపాల్ రెడ్డి, చీరిక వేణు రెడ్డి, ఇన్నోవేటర్ షణ్ముఖ రావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసులు, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ. అన్నపూర్ణ, అధ్యాపకులు డాక్టర్ బి.ఎం వినోద్ కుమార్, డాక్టర్ కే సుమలత, డాక్టర్ పి ఉపేందర్, జే.యాకయ్య, యన్ నరేష్, డి ఎస్ రామన్న,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.