గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
ఉట్నూర్,(విజయక్రాంతి): గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి. సురేష్ బాబు అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను, పుస్తకాలను, పాఠకులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తాయన్నారు.
ఇక్కడ సమకూర్చిన అనేక పుస్తకాలు, గ్రంథాలు ఎంతో మంది పాఠకులు, నిరుద్యోగులకు దోహదపడతాయని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్‌లను పక్కన పెట్టి పుస్తక పఠనం చేస్తే మంచి జ్ఞానం వస్తుందన్నారు. గ్రంథాలయాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మండల కేంద్రంలో స్థలం కేటాయిస్తే నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయ అధికారి కాంభ్లే వెంకటి, గ్రంథాలయ సిబ్బంది బోడికే దళితానంద్ తదితరులు ఉన్నారు






