27 March, 2026 | 1:56 PM

Breaking News

శ్రీశైల క్షేత్రంలో వైభవంగా సీతారాముల కల్యాణం.!   •   దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •   తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్   •  

బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం

25-03-2026 02:57 PM

సామాజికవేత్త బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

దేవరకొండ,(విజయక్రాంతి): బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం అని సామాజికవేత్త బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్  అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.  అనంతరం మాట్లాడుతూ... ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి అసెంబ్లీలో ఆమోదానికి సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీల మాదిరిగా రక్షణ చట్టం కావాలని తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే వెనుకబడిన కులాలకు ప్రత్యేక పరిరక్షణ చట్టం అవసరం వడ్డెర, పిచ్చకుంట్ల, బుడబుక్కల చాలా కులాల సంచార జాతులుగా జీవిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సరియైన కుల గణాంకాలు లేకపోవడం వల్ల సమాజంలో అసమానతలు దాడులు జరగడం వల్ల స్వేచ్ఛగా జీవించేటటువంటి పరిస్థితి లేదు అని అన్నారు.  ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న బిక్షమయ్య, గిరి, ఆరె కంటి శ్రీనివాస్ గౌడ్, చిట్టిపోలు వెంకన్న, భీమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు