తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన
17-06-2026 04:27 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరో రెండు రోజుల్లో యూరియా యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి దుకాణంలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు యాప్ వినియోగంపై ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-123-7157 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ఎరువుల విక్రయాలకు సంబంధించిన సూచనలు, నిబంధనల ఫ్లెక్సీలను ప్రతి దుకాణంలో ఏర్పాటు చేయాలని దుకాణ యాజమాన్యాలకు సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారి కె. సంజీవ్ పాల్గొన్నారు.






