17 June, 2026 | 5:53 PM

కలెక్టర్.. టీచర్ అయ్యారు

17-06-2026 04:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా బుధవారం టీచర్ అయ్యారు. కుంటాల తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్ పదో తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లారు. పిల్లలంతా గుడ్ మార్నింగ్ సార్ అనగానే వెరీ గుడ్ మార్నింగ్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ నేనెవరినో తెలుసా అనగానే మీరు కలెక్టర్ సార్ అని విద్యార్థులు చెప్పడంతో సంతోషపడ్డారు. వెంటనే టీచర్లు బాగా చదువుతున్నారా. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.

పదవ తరగతి సిలబస్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను బోర్డుపై రాసి వాటికి విద్యార్థుల చేత సమాధానం చెప్పించుకున్నారు. ఇంగ్లీషులో ప్రశ్నలు అడగగా కొందరు విద్యార్థులు జవాబు చెప్పడంతో వెరీ గుడ్ బాగా చదువుతున్నారు ఇంకా బాగా చదవండి అంటూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన, ఎంఈఓ ముత్యం, సర్పంచ్ జక్కుల గజేందర్, ప్రిన్సిపల్ రాజు తదితరులు ఉన్నారు.