ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
17-06-2026 04:34 PM
భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్ అక్కడి హాజరు పట్టిక మందుల వివరాలు విధులు నిర్వహించే సిబ్బంది పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అక్కడ నెలకొన్న సమస్యలు ఖాళీల భర్తీపై అక్కడ సిబ్బంది కలెక్టర్ దృష్టికి దిగా వాటిని సత్కారం పరిష్కరిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ స్థానిక వైద్యులు పాల్గొన్నారు






