17 June, 2026 | 5:42 PM

మడే రాజేష్ కు గౌరవ డాక్టరేట్ పురస్కారం

17-06-2026 04:44 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన మడే రాజేష్ కి గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. రాజేష్ సమాజంలోని పేద విద్యార్థుల చదువులకు అవసరమయ్యే ఆర్థిక సహకారం అందించినందుకుగాను ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజేష్ సేవలను గుర్తించిన ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్, స్ఫూర్తి అకాడమీ సంస్థ ఈ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ ను అతనికి ప్రధానంచేసింది. హైదరాబాద్ లోని బొగ్గులకుంట సరస్వత పరిషత్ లో జరిగిన కార్యక్రమంలో రాజేష్ కు డాక్టర్ గూడూరు చిన్నారెడ్డి, యాదగిరి గౌడ్, సరిత అవార్డ్ అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అవార్డ్ తనపై మరింత బాధ్యతను పెంచిందని,భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని వెల్లడించారు. రాజేష్ కు అవార్డ్ రావడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందించారు.