ఆర్ కొత్తగూడెంలో ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతం
80 మందికి ఉచిత సేవలు
చర్ల,(విజయక్రాంతి): చర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతమైంది. చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఈదయ్య ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ప్రముఖ దంత వైద్య నిపుణులు డా. గీతానంద్ శిబిరాన్ని నిర్వహించి, వచ్చిన రోగులకు పరీక్షలు చేసి అవసరమైన సూచనలు, చికిత్సలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 80 మంది గ్రామస్తులు దంత సమస్యలకు పరిష్కారం పొందారు. పళ్ల నొప్పి, చిగుళ్ల సమస్యలు, పంటి క్షయం తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు.
చికిత్సలో డా. గీతానంద్‌కు గోసుల మనోజ్ కుమార్, అనుస్వాతి, కోరం రేణుక సహాయకులుగా వ్యవహరించారు. ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్య బృందానికి, నిర్వాహకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీఓ ఈదయ్య మాట్లాడుతూ, పల్లె ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆత్మ కమిటీ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ కొత్తగూడెం సర్పంచ్ సున్నం రవి నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు. చర్ల ఉపసర్పంచ్ కాపుల కృష్ణ, ఆత్మ కమిటీ అధ్యక్షులు ఇందల బుచ్చిబాబు పాల్గొన్నారు.






