11 August, 2026 | 4:05 AM

డబుల్ బెడ్రూమ్ కాలనీకి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి

11-08-2026 12:00 AM

పెబ్బేరు, ఆగస్టు 10 (విజయక్రాంతి): పెబ్బేరు పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీకి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కాలనీ వాసులు కోరారు. ఈ మేరకు సోమవారం ఎస్త్స్రకి వినతిపత్రం అందజేశారు. సరైన సర్వీస్ రోడ్డు లేక ప్రధాన రహదారిపైకి రావాల్సి వస్తుండటంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.