32 ఏళ్ల ఎడబాటు.. క్షణాల్లో కరిగిపోయిన కాలం..
నార్సింగి మిత్రుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం
మణికొండ, జూలై 21 (విజయక్రాంతి): నార్సింగి జడ్పీ హైస్కూల్ 199495 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఖానాపూర్లో మంగళవారం అపూర్వ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూభావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై ప్రతి ఏటా తప్పనిసరిగా కలుసుకోవాలని, కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు మహికృష్ణ, హరికృష్ణ, రాజు, రమేష్, నాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్, సుధాకర్, శ్రీపాల్ సమన్వయం చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులను తోటి మిత్రులు త్రివేణి, ఉమాదేవి ప్రత్యేకంగా సత్కరించి బహుమతులు అందజేశారు. ‘కోట్లు కూడబెట్టినా స్నేహితులతో గడిపిన మధుర క్షణాలకు సాటిరావు’ అని పలువురు కొనియాడారు. ఈ ఆత్మీయ కలయికతో ఖానాపూర్లో పండుగ వాతావరణం నెలకొంది.






