బచ్చోడులో ఆటో, బొలెరో ఢీ..
ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
తిరుమలాయపాలెం, జూన్ 19 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని బచ్చోడు గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం కాస్పటికి చెందిన ఆటో రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రుడికి సహాయం అందించారు.
సమాచారం అందుకున్న ఎస్త్స్ర కూచిపూడి జగదీష్ నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరి స్థితిని పరిశీలించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.






