12 March, 2026 | 4:09 AM

మైనర్ల కామ క్రీడల్లో కొత్తకోణం!

12-03-2026 02:09 AM
  1. గర్భం దాల్చిన బాలికకు సాయి కృప ఆసుపత్రిలో అబార్షన్ 
  2. స్కానింగ్ సెంటర్ సీజ్
  3. ఆస్పత్రి సీజ్‌కు నిర్ధారణ కమిటీ అనుమతికి సిఫారసు

నాగర్‌కర్నూల్, మార్చి 11 (విజయక్రాంతి)/కొల్లాపూర్: హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ చదువుతున్న ఓ యువకుడు అదే కళాశాలలో చదువుతున్న బాలికను లోబర్చుకొని హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో కామ క్రీడల్లో మునిగితేలుతూ స్వతహాగా వీడియోలు కూడా రికార్డ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు దేహశుద్ధి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఈ నెల 5న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నెల ‘8న హాస్టల్‌లో మైనర్ల కామ క్రీడలు’ కథనాన్ని విజయక్రాంతి ప్రచురించింది. ఈ వ్యవహారంలో పోలీసులకు మరిన్ని విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. బాలికలను మాయమాటలతో లోబర్చుకొని శారీరక సుఖాలకు మరిగిన వ్యవహారం బయటపడింది. ఇలా ఓ బాలిక గర్భం దాల్చగా గుట్టుచప్పుడు కాకుండా కొల్లాపూర్‌లోని సాయికృప ఆసుపత్రిలో అబార్షన్ చేయించినట్లు విచారణలో బయటపడింది.

దీంతో డీఎస్పి బుర్రి శ్రీనివాసులు, జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవికుమార్ తన సిబ్బందితో కలిసి సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం సాయి కృప ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. ఆసుపత్రిని కూడా సీజ్ చేసేందుకు నిజ నిర్ధారణ కమిటీ అనుమతి కోరుతూ ఆపిల్ చేసినట్లు ఇన్చార్జ్ వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో అతి చిన్న వయసులోనే బాలికల పట్ల వ్యామోహంతో వారి జీవితాలను ఆగం చేస్తున్న యువకుల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలిసింది.