15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

మోడీని విమర్శిస్తే సీఎంకు గుణపాఠం

10-06-2026 01:47 AM

నిర్మల్ జూన్ 9 ( విజయ క్రాంతి): సబ్కా సార్ సబ్కా వికాస్ నినాదంతో దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టడం నైతిక విలువ కోల్పోవడానికి నిదర్శనమని బిజెపి రాష్ట్ర నాయకులు రావులమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలని సూచిం చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని గుర్తు చేశారు.

పంట కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర సర్కార్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని రైతులు పండించే పంట కొనుగోలు చేసే ధైర్యం లేని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. దేశ ప్రధాని విమర్శించిన మాత్రాన బిజెపికి నష్టమేమీ లేదని అది కాంగ్రెస్ కష్టంగా మారబోతుం దని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాచకొండ సాగర్ నాయకులు కార్తీక్ ముతిన్ రెడ్డి పొన్నం నారాయణ గౌడ్ జుట్టు దినేష్ కల్పనా గౌడ్ పాల్గొన్నారు.