29 August, 2026 | 1:26 AM

చూపు కోసం పోరాడుతున్న బాలికకు చేయూత

29-08-2026 12:21 AM

వేములవాడ, ఆగస్ట్ 28, (విజయక్రాంతి): కంటి చూపు సమస్యతో బాధపడుతున్న బాలిక కుటుంబానికి సామాజిక సేవకుడు మహమ్మద్ నఈమోద్దీన్ (నయీం) అండగా నిలిచారు. పట్టణంలోని సాయినగర్కు చెందిన జూబియా తబస్సుం కొంతకాలంగా కంటి చూపు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రులను సంప్రదించినా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చికిత్స కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.బాలిక పరిస్థితిని తెలుసుకున్న నయీం ఆమె కుటుంబాన్ని పరామర్శించి మానవత్వంతో స్పందించారు. తక్షణ సాయంగా రూ.5 వేల నగదును అందజేశారు. బాలిక చికిత్సకు అవసరమైన సహాయాన్ని భవిష్యత్తులోనూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన నయీంకు బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ మాజీ నాయకులు, మత పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.