calender_icon.png 18 February, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పెద్ద రథోత్సవం

18-02-2026 12:00:00 AM

మేళ్లచెరువు, ఫిబ్రవరి 17 : మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం పెద్ద రథోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా కన్నుల పండుగ జరిగింది.ఈ సందర్భంగా స్వామివారికి ఉదయాన, అభిషేకాలు కుంకుమార్చనలు, అవపాసన పుష్పాలంకరణ,మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

రథోత్సవాన్ని తిలకించటానికి వచ్చిన భక్తుల శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. అక్కడికి వచ్చిన భక్తులు శివనామ స్మరణతో ఉత్సాహంగా రథాన్ని  లాగి భక్తి భక్తి పారవశ్యం  సాటి చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ లచ్చయ్య, ఈవో శంబి రెడ్డి  తాసిల్దార్ రాజేందర్ రెడ్డి పాలక మండలి సభ్యులు, అర్చకులు కె రాధాకృష్ణమూర్తి, కె విష్ణువర్ధన్ శర్మ, కె ధనుంజయ శర్మ, వాసు శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.