8 June, 2026 | 4:28 PM

Breaking News

గ్రామ ప్రగతికి ప్రతి ఒక్కరు సహకరించాలి   •   ముదిరాజ్ సంఘానికి ప్రొసీడింగ్ అందజేసిన సర్పంచ్ గండి నారాయణ   •   శ్రీ కోటి లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు   •   సీఎం రేవంత్‌ హిట్లర్‌ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌ బాబు వివరణ   •   గ్రామ పంచాయతీలో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం: తాహశీల్దార్   •   పూర్తి వేతనం విడుదల చేయాలని లెక్చరర్ల వినతి   •   మద్యం మత్తు వీడితేనే గ్రామాల అభివృద్ధి ముందుకు.!   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ   •   అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం   •  

సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం

04-06-2026 12:24 AM

ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, జూన్ 3: సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం లభిస్తుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల పట్టణంలోని కల్వకుర్తి రోడ్డులో బీసీ హాస్టల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన నోవాస్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.

కార్పొరేట్ స్థాయి వైద్యం ఇకపై స్థానికంగానే లభిస్తుందని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. హాస్పిటల్ యాజమాన్యం తరఫున డాక్టర్ సామ్యూల్ మాట్లాడుతూ, కార్డియాలజీ, డెర్మటాలజిస్ట్ విభాగాలలో నిపుణులైన వైద్యులు, డాక్టర్లు ప్రణయ్, డాక్టర్ ప్రతిమ ఆధ్వర్యంలో అత్యధిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. జడ్చర్లతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, బాద్మి ధ్రువ, యాదయ్య, సుదర్శన్ గౌడ్, నిత్యానందం, మాజీ కౌన్సిలర్లు, జడ్చర్ల పట్టణ డాక్టర్స్, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.