calender_icon.png 20 February, 2026 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభయారణ్యంలో మండుతున్న కార్చిచ్చు

20-02-2026 02:10:49 AM

  1. బ్రహ్మగిరి, వటవర్లపల్లి బీట్ అడవిలో మంటలు

సుమారు 60 హెక్టర్ల అడవి దగ్ధం

అచ్చంపేట, ఫిబ్రవరి 19: వేసవి ఉక్కపోత మొదలుకాకముందే నల్లమల్లలోని అ మరాబాద్ పులుల అభయారణ్యం పరిధిలో కార్చిచ్చు మొదలైంది. ఇప్పటికే అక్కడక్కడ మంటలు చెలరేగుతుండగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు భారీ స్థాయి లో అడవిలో కార్చిచ్చు రాజుకుంది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లోని అమ్రాబా ద్ డివిజన్ లోని మన్ననూర్, దోమల పెంట (బ్రహ్మగిరి) రేంజి పరిధిలో దాదాపు 60 హెక్టార్లలో అడవి కాలినట్లు తెలుస్తుంది.

విషయం తెలిసిన వెంటనే అటవీ క్షేత్ర అధికారి గురుప్రసాద్ తన స్పెషల్ టాస్క్ ఫో ర్స్లోని సుమారు 20 మంది సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు వీలైనంతవరకు వాటిని తగ్గించే ప్రయత్నం చేశారు. దాదాపు 8 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ప్రస్తుతం మంటల తీవ్రత తగ్గిందని అటవీ అధికారులు చెబుతున్నారు. 

ఏదన్నా చిన్న నిప్పురవ్వ ఉన్నా కూడా ప్రస్తుత గాలుల వలన మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రధానంగా మనుషులు వెళ్లలేని ప్రదేశంలో మంటలను ఏ విధంగా అదుపు చేయాలో ప్రత్యామ్నాయంగా ఆలోచన చేస్తున్నామన్నారు. వేసవి ఆరంభంలోనే కార్చి చ్చు ఇలా ఉంటే.. కీలకమైన ఏప్రిల్, మేలో ఎలా ఉంటుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.