11 April, 2026 | 3:09 PM

Breaking News

సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •   నిర్మల్‌లో నిరసన తెలుపుతున్న నాయకులు   •   అతిధి అధ్యాపకుల సర్వీసును 2026-27 విద్యా సంవత్సరానికి కొనసాగించాలి   •   ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కరించండి   •   పేదల అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి   •   సనత్‌నగర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకలు   •  

గ‘లీజు’ దందా..!

07-01-2026 12:37 AM
  1. గంజ్ హైస్కూల్ దుకాణాల లీజుదారుల దోపిడీ

ఓపెన్ యాక్షన్ నిర్వహించా లంటున్న నగరవాసులు

కరీంనగర్, జనవరి 6 (విజయ క్రాంతి): కరీంనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల(గంజ్) అతిపురాతనమైనది. 1928లో కరీంనగర్ నడిబొడ్డునగల గంజ్ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేశారు. నగర ప్రధాన వ్యాపార కూడలిగా ప్రకాశం గంజ్ నేటికి కొనసాగుతున్నది. ఈ ప్రకాశం గంజ్ వ్యాపార కూడలి సముదాయానికి ఆనుకొని గంజ్ హైస్కూల్ ఉంటుంది. ఈ గంజ్ హైస్కూలో వ్యాపార కూడలివైపు 21 దుకాణాల సముదాయాన్ని 1981 లో నిర్మించారు. పాఠశాల అభివృద్ధికి గాను కిరాయి ద్వారా వచ్చే సొమ్ము పనికి వస్తుందని భావించి ఈ నిర్మాణం చేపట్టారు.

21 దుకాణాలను లీజు పద్ధతిలో కేటాయించారు. తొలుత 25 సంవత్సరాల లీజు, అది ముగిసిన తర్వాత 10 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. ఈ లీజుకు పీరియడ్ 2028తో ముగియనుంది. ఈ దుకాణాల సముదాయాల లీజును నెలకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అయితే ఈ సముదాయంలో ఒకరిద్దరు తప్ప లీజుదారులెవరు వ్యాపారం చేయడం లేదు. వీటిని సబ్ లీజు కింద ఇతరులకు ఇచ్చేశారు. వీరి వద్ద నుండి వారు నెలకు 15 వేల వరకు, కొందరు 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

ఈ సబ్ లీజుదారులు కూడా గంజ్ రహదారిని ఆక్రమించి ముందు వరకు షెడ్లను నిర్మించి స్వంత దుకాణాల తరహాలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. లీజుదారులు చెల్లించే వెయ్యి రూపాయలు సంవత్సరానికి 21 వేల రూపాయలు ప్రభుత్వానికి వస్తుండగా, లీజుదా రులు మాత్రం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సంపాదిస్తున్నారు. కొందరు గంజ్ పెద్దలు, రాజకీయ నాయకుల సహకారంతో ఈ లీజు ధరను పెంచకుండా వ్యాపారులు ఈ దందాను. కొనసాగిస్తున్నారు.

కొందరు అమ్మేశారు..

లీజు వ్యవహారం ఇలా ఉంటే ముగ్గురు లీజుదారులు ఏకంగా ప్రముఖ వ్యాపారులకు అగ్రిమెంట్ పద్ధతిలో అమ్మేశారు. ఈ వ్యవహారం తెలిసినప్పటికి ఇటు విద్యాశాఖ అధికారులుగాని, ఆర్ అండ్ బి అధికారులుగాని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ ’గ’లీజు దందాను అరికట్టాలని, గంజ్ హైస్కూల్ ఆదాయ వనరులు పెంచేందుకు ఈ దుకాణాల సముదాయానికి ఓపెన్ యాక్షన్ ద్వారా లీజుకు ఇవ్వాలని కోరుతున్నారు.