14 August, 2026 | 4:38 AM

ముల్కనూరులో దాన శాసనం లభ్యం

14-08-2026 12:15 AM
  1. వెలుగులోకి అనేక విషయాలు
  2. వెల్లడించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు, సభ్యుడు

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ముల్కనూరులో మహాసామంతుని కొత్త శాస నం వెలుగుచూసింది. దీని ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్, పరిశోధక సభ్యుడు జి. కిశోర్ వివరించారు. కిశోర్ అన్వేషణలో హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని మహిళా సహకార డెయిరీ వెనకాల కాటమయ్య రాతిగుండుమీద ఈ శాసనం, శిల్పాలు చెక్కబడి ఉండటాన్ని కనుగొన్నారు.

రాతిగుండు ఎదురుగా మొక్కుబడి నాగశిలలున్నాయి. ఇవి రాష్ట్ర కూటానంతరం చెక్కబడిన శైలిలో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ శాసనం వల్ల కళ్యాణీ చాళుక్యుల పాలనాకాలంలో ‘సమధిగత పంచ మహాశబ్ద’ ప్రశస్తిగల మహాసామంతుడు (బిజ్జన) చైత్రశుద్ధ ద్వాదశినాడు ముల్కనూరులో నీర్నేలను దానం చేసినట్లు అధ్యక్షుడు హరగోపాల్ వివరించారు.

శాసన పాఠం..

స్వస్తిసమధిగత పంచమహాశబ్ద మహాసామన్త సత్యాశ్రయ పన్వయని.. ల..............హిధరం తని త్సర వంశ..... కాలాన ల......య్వస్యొవంన్రి పరాదేయం త్రొయ్యటిలి.. పంపి.. కలాయుగ........ లిమ్వన్నిశివం బిజ్జన(ది)రాజ..నయ్య(న్వీ)పరాదేయ..య్యదిలి..మల్లదేవనచత్ర..త.. మపని............ విజయరాజ్యముత్తరోత్తర.. ప్రిథ్వి ప్రవర్ధమానమాచంద్రరారార్కం పిరర............నేయ......త్సరదచైత్ర సుద్ద12 ఆదిత్యవారదందు ముల్కలూరరొన్ద ఆయ్తి...సకతిద............క............ నెన్దొ..........ఱేయ పేఱగణ నిర్నేలం బీవ్వరమలొనితారత్తి పమలుతొఱ్వం....అప్రితియా....డుది... ......  మ..సలిసువమ..లమకలతరలి..రొజ్య....గియ్య........ససన్రారూ(డి)మవ్వ... ...........మదత్తియా సలిసి ప్రతిపాది........నదసి.................. ధర్మసేతు నృపాణాం కాలేకాలే పాలనీయో భవద్బిః భూయో యాచతే రామచంద్రా...........