23 May, 2026 | 2:38 AM

రైతుల అవస్థలు పట్టని సీఎం

23-05-2026 01:17 AM
  1. టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత
  2. సచివాలయం ఎదుట టీఆర్‌ఎస్ ధర్నా.. నేతల అరెస్ట్

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): రైతుల అవస్థలను సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా వ్యవసాయశాఖపై సీఎం రివ్యూ చేయలేదని ఆరోపించారు.

రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని శుక్రవారం సచివాలయం వద్ద టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేయగా పోలీసులు అరెస్ట్ చే శారు. రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో అన్యా యం చేయొద్దంటూ  సచివాలయం వద్ద     ధర్నా నిర్వహించారు. టీఆర్‌ఎస్ శ్రేణులు, మ హిళలు, రైతులు ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఈ సీఎం పట్టించుకోవటం లేదన్నారు. రెండున్నరేళ్లుగా వ్యవసాయ శాఖపై కనీసం రివ్యూ చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి కుప్పలపై చనిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని కవిత ప్రశ్నించారు.  ఇకనైనా రాష్ట్ర  ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోని రైతుల సమస్యలను పట్టించుకోవాలని కవిత డిమాండ్ చేశారు.  ధర్నాకు దిగిన కవితతో సహా రైతు లు, మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కవితను ఫలక్‌నుమా స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు.