వందో వసంత వేడుక... సకుంటుబ సపరివార సమేతంగా..
18-05-2026 01:58 AM
సైదాపూర్, మే 17(విజయక్రాంతి): మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి వీరవ్వ వందో పుట్టిన రోజు వేడుకను ఆదివారం సకుటుంబ సపరివార సమేతంగా గ్రామంలో నిర్వహించారు . వీరవ్వకు అయిదురు కుమార్తెలు. ఈ వందేళ్ల వేడుకకు కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్లు, ముని మనుమలు, ముని మనుమరాళ్లు హాజరయ్యారు. నాలుగుతరాలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని వీరవ్వకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వీరవ్వ మాట్లాడుతూ వందో పుట్టిన రోజును కుటుంబ సభ్యులంతా నిర్వహించడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి లోనైంది. దేవుడు తనకు ఇచ్చిన ఓ వరం అని పేర్కొన్నారు. ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటానని వీరవ్వ వెల్లడించింది.






