16 July, 2026 | 12:41 AM

బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్!

16-07-2026 12:09 AM

టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఇటీవల అక్కినేని అఖిల్ సరసన నటించిన ‘లెనిన్’ చిత్రంతో ఆమె కెరీర్‌లోనే భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమా విజయంతో ఈ ముద్దుగుమ్మ రేంజ్, క్రేజ్ ఒక్కసారిగా మారిపోయాయి.

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి ఇప్పుడు బాలీవుడ్‌లో ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మిలాప్ జవేరి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఒక భారీ ప్రాజెక్టులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఎంపికైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినవస్తోంది.

ఈ సినిమాలో ఆమె బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ సరసన నటించనున్నట్టు తెలుస్తోంది. భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ ఎంట్రీ గురించి క్రేజీ అప్‌డేట్‌కు సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ సరసన ‘సెయాన్’ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. లెజెండరీ నటుడు కమల్‌హాసన్, మహేంద్రన్ కలిసి రాజ్ కమల్ ఫిలమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కావటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.