23న వస్తున్న జన నాయకుడు
16-07-2026 12:08 AM
తమిళనాడు సీఎం, దళపతి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీ సెన్సార్ సమస్య కారణంగా వాయిదా పడింది. తాజాగా జూలై 23న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ‘పోరాటం ఎంత కఠినంగా ఉంటే విజయం అంత ఘనంగా ఉంటుంది’ అంటూ ఎక్స్ వేదికగా నిర్మాతలు పంచుకున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.






