12 March, 2026 | 6:50 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు

12-03-2026 04:54 PM

ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ 

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తిర్యాని మండలంలోని ఆశ్రమ హైస్కూల్‌లో గురువారం “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఏఎస్పీ చిత్తరంజన్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు.ఆశ్రమ స్కూల్ విద్యార్థులకు వాలీబాల్ కిట్ అందజేశారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ చిత్తరంజన్ మాట్లాడుతూ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. చదువు ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొంటూ విద్యార్థులను ప్రోత్సహించారు. పదవ తరగతి విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలు సాధించవచ్చన్నారు. గ్రామీణ ,గిరిజన ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగితే దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, తీర్యాని ఎస్‌ఐ వెంకటేష్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.