మహానేతలను ఆదర్శాలను పాటించాలి
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): మండలంలోని బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పేరుపల్లి సాయిబాబా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మహానేతల ఆదర్శాలను పాటించాలని,విజ్ఞానంతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు.ప్రాథమిక స్థాయి నుండి ప్రణాళిక బద్ధమైన చదువులు అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.
గత కేసిఆర్ ప్రభుత్వంలో వేలాది మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి నిరుపేదలు సైతం నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు కృషి జరిగిందన్నారు.అలాగే పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ స్పాట్స్ మరియు ఇతర సామాగ్రి అందజేసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.




