9 May, 2026 | 2:19 PM

Breaking News

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం   •   మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం   •   అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •  

ఉత్తమ జీవనశైలితో ఉజ్వల భవిష్యత్తు...

20-02-2026 05:51 PM

- లీడ్ ఇండియా స్టేట్ ట్రైనింగ్ మేనేజర్ శ్రీనివాస్ ఆచార్య 

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు పునాది ఉత్తమ జీవనశైలితో ఏర్పడుతుందని లీడ్ ఇండియా స్టేట్ ట్రైనింగ్ మేనేజర్, వ్యక్తిత్వ వికాస నిపుణులు తాడూరీ శ్రీనివాస్ ఆచార్య అన్నారు. శుక్రవారం లీడ్‌ ఇండియా-2047 ఆధ్వర్యంలో మంచిర్యాల PM SHRI మోడల్ స్కూల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడారు. మనం ఆచరించే సమోన్నత జీవనశైలి, మనం పాటించే ఉన్నత అలవాట్లు మాత్రమే ఉపయోగపడుతాయని, పిల్లలు విద్యను నమ్ముకొని పేదరికాన్ని జయించి దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో అధిరోహించాలంటే ఇప్పటి నుంచి మంచి అలవాట్లతో పాటు ఉత్తమ నడవడికను కలిగి ఉండి విద్యలో రాణించాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలంటే నేడు మనం చేస్తున్న స్మార్ట్‌ వర్క్ ఉపయోగపడుతుందని దిశా నిర్దేశం చేశారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులను నమ్మిన ప్రతి ఒక్కరూ అనుకున్న స్థాయికి ఎదుగుతారని, ప్రతి ప్రయత్నంలో మన పూర్వపు ఫలితాలను అధిగమించి ఉత్తమ ఫలితాలను సాధించడం ద్వారా అగ్ర స్థానంలోకి చేరవచ్చన్నారు. మనం పరిశీలిస్తున్న ప్రతి అంశం పట్ల అవగాహన పెంచుకోవాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.

పారా ఒలంపిక్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత అంజనా రెడ్డి, సైకాలజిస్ట్ సత్య ప్రకాష్ లు మాట్లాడుతూ తల్లితండ్రుల కలల్ని సాకారం చేయడానికి నడుం బిగించాలన్నారు. పిల్లలలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీయడమే కాకుండా వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు  రామకృష్ణ రావు, శ్రీనివాస్, ఈ శ్రీనివాస్ లతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.