23 July, 2026 | 1:21 PM

కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం

23-07-2026 12:23 PM

ఎర్రుపాలెం జూలై 23( విజయక్రాంతి): ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులపై పోలీసులు లాటి చార్జి చేసి విద్యార్థులను కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ శ్రేణులు గురువారం నాడు అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి ,మండలంలోని కాంగ్రెస్ సర్పంచులు, క్లస్టర్ ఇంచార్జిలు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.