23 July, 2026 | 12:56 PM

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తాళ్లపల్లి సంపత్ గౌడ్

23-07-2026 12:15 PM

మానకొండూరు, జూలై 23 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ నియమితులయ్యారు.తాళ్లపల్లి సంపత్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో  మండల ప్రధాన కార్యదర్శిగా, బీసీ సెల్ మండల అధ్యక్షునిగా, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ అవకాశం కల్పించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సీనియర్ నాయకులకు, సర్పంచులకు, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, సహకార సంఘ చైర్మన్, డైరెక్టర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరుపేరునా తన కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై పార్టీ బాధ్యులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు, బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.