23 July, 2026 | 1:26 PM

వెల్గటూర్ మాజీ ప్రజా ప్రతినిధికి హెచ్చరిక

23-07-2026 12:07 PM

లేఖ విడుదల చేసిన అజ్ఞాతవాసులు 

ధర్మపురి,జూలై23(విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రం(Velgatur Mandal Headquarters)లో 10 సంవత్సరాలు సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించిన ఓ మాజీ ప్రజా ప్రతినిధికి అజ్ఞాతవాసులు బుధవారం లేఖను విడుదల చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ లేఖను అజ్ఞాత వాసులు విడుదల చేసి వెళ్లారు.ఇప్పటి వరకు గ్రామ ప్రజలకు చేసిన అన్యాయాలు చాలoటూ, అన్నీ ఆపేసి ఇంట్లో కూర్చోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియా లో వైరల్ అయిన అజ్ఞాతలేఖ "విజయక్రాంతి" కి చిక్కింది. ఈ అంశంపై సదరు నేత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.