ప్రధాని మోదీ కారణమంటూ.. లేక రాసి యువకుడు ఆత్మహత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సిరిసిల్ల,జులై 23(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన పిట్ల వంశీ బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తన చావుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కారణమని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే తన కుటుంబ సభ్యులను ఎవరు ఇబ్బంది పెట్టవద్దని, తన అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం నిర్వహించాలని లేఖలో కోరినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యువకుడు లేఖలో రాసిన వాక్యాలు ఆత్మహత్యకు గల అసలు కారణాలు, తనను ఎవరైనా ప్రేరేపించారా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.






