27 July, 2026 | 6:59 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం

05-06-2026 01:20 AM

బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్ జూన్ 4 (విజయ క్రాంతి): తెలంగాణలో రాబోతుంది బీజేపీ ప్రభుత్వమేనని బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం నిర్మల్ జిల్లాలోని బాలాజీ ఇన్ లో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ  జిల్లా స్థాయి శిక్షణ తరగతులను బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి  పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడాను. ‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చాను. 

తెలంగాణలో బిజెపికి అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో ప్రజాక్షేత్రంలో పనిచేయాలి.  పార్టీ బలోపేతమే లక్ష్యంగా కలిసి కృషి చేస్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.  ఈ శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ గారు, రావుల రాంనాథ్ గారు, మేడిశెమ్మే రాజు గారు, యాతాళం చిన్నారెడ్డి గారు, నల్లా రవీందర్ రెడ్డి గారు, కరిపే విలాస్ గారు, సత్యం చంద్రకాంత్ గారు, బుర్ర రమేష్,జిల్లా పాదాధికారులు రాష్ట్ర నాయకులు, జిల్లా లోని మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.