calender_icon.png 5 February, 2026 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి ఆదర్శంగా సీనియర్ సిటీజన్స్ సేవలు

04-02-2026 07:57:30 PM

 – తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్,(విజయక్రాంతి): తమ వయసును లెక్క పెట్టకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న సీనియర్ సిటీజన్స్  ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్ నగర్ డివిజన్ లోని మోడల్ కాలనీలో గల సంస్కృతి హాల్ లో  సాయి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సీనియర్ సిటీజన్స్ కు ఫ్రైజ్, సర్టిఫికెట్ ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం జనవరి 26 సందర్భంగా సీనియర్ సిటీజన్స్ కు నిర్వహించిన చెస్, క్యారమ్, మ్యూజిక్ చైర్ తదితర వివిధ రకాల క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఫ్రైజ్ లు, సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో వివిధ హోదాలలో పనిచేసి రిటైర్మెంట్ పొందిన తర్వాత అంతా ఐక్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం ఎంతో గొప్ప విషయం అన్నారు. ఇవే కాకుండా ఎంతో ఉత్సాహంగా క్రీడలలో పాల్గొనడం పట్ల సీనియర్ సిటిజన్ సభ్యులను అభినందించారు.

సేవా కార్యక్రమాల తో పాటు మీ ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని కోరారు. రచయిత లను గౌరవించడం, ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటీజన్స్ ను నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని చెప్పారు. అందుకే తనకు సీనియర్ సిటీజన్స్ అంటే ప్రత్యేక గౌరవం, అభిమానం ఉందని అన్నారు. నేటి తరం పిల్లలకు మన సంస్కృతి, పండుగల ప్రత్యేకత తెలవదని, విదేశాలలో మన సంస్కృతి, సాంప్రదాయాలను ఎంతో గొప్పగా, పండుగలు ఘనంగా జరుపుకుంటారని చెప్పారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు సంస్కృతి, పండుగల విశిష్టత ను తెలియజేయాలని అన్నారు. ఈ సందర్భంగా రచయిత లావణ్య ను రసమయి బిరుదు ప్రధానం చేసి సన్మానించారు. అదేవిధంగా కవి బాలరాజ్ యాదవ్ ను సన్మానించారు. అనంతరం క్రీడలలో గెలుపొందిన వారికి ఫ్రైజ్ లు, సర్టిఫికెట్ లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు దూబే, ఆసరా ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్, సీనియర్ సిటీజన్స్ పార్థసారధి, మానిక్ రావ్ పాటిల్, అనంత రెడ్డి, భద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.